Breaking News

పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్

ధవలేశ్వరం (తూర్పుగోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం పై పోలవరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఇందులో బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం పై తగిన విచారణ చేపట్టవలసిందిగా జాయింట్ కలెక్టర్ కు సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సందర్శించి, ఘటన వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీతనం ఉండేలా ప్రజలకు పరిపాలన అందించాలనే సంకల్పంతో ఉందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చే రీతిలో కొందరు అధికారులు ఉద్యోగులు ప్రవర్తించడం, సంఘటనలు జరగడం వంటి వాటి విషయాలలో ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఆఫీసు రికార్డు రికార్డులకు సంబంధించిన పేపర్లను తగులు పెట్టిన విషయాన్ని తీవ్రంగా పరిణించడం జరుగుతుందన్నారు. ఇందులో వాస్తవాలను తెలుసుకునేందుకు జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టాలని మంత్రి కోరడం జరిగింది. ఇందులో దోషులను గుర్తించాలని ఆసక్తి వద్దని, ఈ ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామైన వారిని ప్రతి ఒక్కరిని గుర్తించి కఠినమైన చర్యలని తీసుకోవాలన్నారు. ఇందులో భాగ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయం సంబంధించిన ఫైల్స్ పాతవి భద్రపరిచే ఉంచాలని, ఏమైనా ఫైల్స్ డిస్పోజ్ (పారవేయడం/కాల్చడం) చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావడం జరగాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చే విధంగా సంఘటనలు జరగడంపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు.  ఫైల్స్ డిస్పోజ్ చేసే క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం తోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవలసిన వాటి విషయంలో సంబంధిత సిబ్బంది అలసత్వాన్ని ఉపేక్షించబడ్డని మంత్రి స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించాలని సంకల్పానికి తూట్లు పొడిచే విధంగా ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అందించిన సామాజిక భద్రత పెన్షన్లు రైతు బకాయిల చెల్లింపులు, సరసమైన ధరలకు నిత్యవసర వస్తువులు అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు.

ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు వివరణ ఇస్తూ, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. భూ సేకరణ సంబంధించి ఫైల్స్ విషయంలో సంబంధిత సిబ్బంది అలసత్వం పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. దోషులను తెలితే శాఖ పరమైన చర్యలతో పాటు, పోలీసు వారి ద్వారా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పరిపాలనలో భాగంగా ఎల్డిస్ , డిడిస్, ఆర్డిస్ విధానంలో కాల పరిమితికి లోబడి ఆయా ఫైల్స్ లను డిస్పోజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి ఫైల్స్ లను డిస్పోజ్ చేసే క్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అనుమతులను అనుసరించి చర్యలు చేపట్టడం జరగాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తదుపరి దోషులని తేలితే సస్పెండ్ చేయడం గాని, క్రిమినల్ కేసులు నమోదు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.

ఎస్ పి డి.నరసింహా కిషోర్ మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ భూసేకరణ  ప్రాజెక్టు కార్యాలయంలో శనివారము మధ్యాహ్నం ఫైల్స్ దగ్ధం చేసిన విషయం తెలిసిందేనని, ఆమేరకు డిఎస్పీ అధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలియ చేశారు. చెత్త తగులపెట్టే చిన్న ప్రదేశంలో కొన్ని ఆఫీసు కాగితాలు కాల్చి వేశారన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసిన దృష్ట్యా విచారణ చేపట్టడం జరుగుతోందన్నారు. ఫైల్స్ డిస్పోజ్ చేసే దిశలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం, ఇందులో ఉద్దేశ్య పూర్వకంగా లేదా క్రిమినల్ ఉద్దేశ్యం ఉంటే ఈ పని చేసి ఉంటే అరెస్టు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. శాఖా పరంగా విచారణ అనుసరించి, పోలీసు శాఖ పరంగా కూడా తగిన విచారణ చేపట్టనున్నట్లు ఎస్పి నరసింహ కిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్బంలో రాజమండ్రి ఇన్చార్జి ఆర్డీఓ కే ఎల్ శివజ్యోతి, డిప్యూటీ కలెక్టర్ కె. వేదవల్లి, డిఎస్పీ భవ్య కిషోర్, రాజమండ్రి రూరల్ తహసీల్దార్ జె. లక్ష్మీ రమ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *