విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరుణ్ గ్రూప్ ఛైర్మన్ వల్లూరుపల్లి ప్రభు కిషోర్ సతీమణి లక్ష్మీ జన్మదిన వేడుక పురస్కరించుకొని విజయవాడ నోవోటెల్ వరుణ్ నుండి తిరుమలలో జరుగు అన్నప్రసాద వితరణకు 10,000 కేజీల కూరగాయలు, ద్వారకా తిరుమలలో జరుగు అన్నప్రసాద వితరణకు 5,000 కేజీల కూరగాయలు ఆదివారం పంపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు తమవంతు సహకారంగా అన్నప్రసాద వితరణకు కూరగాయలు అందజేసే అవకాశం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ మీద, సిబ్బంది, కస్టమర్ల దేవుళ్ళపై ఆ స్వామివార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరుణ్ బజాజ్, వరుణ్ మారుతి, జెసిబి వరుణ్, భారత్ బెంజ్, పద్మజ, సుజుకి, నోవెటెల్ హోటల్ సంయుక్తంగా వరుణ్ గ్రూప్ నిర్వాహకులు, సిబ్బంది, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …