విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. అదివారం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులతో కలసి ధర్నాచౌక్ వద్ద దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అందుకు రాజకీయ పక్షాలు, కార్మిక పక్షాల నాయకులు ప్రజలను సంఘటితం చేసి కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని దశరధి రామిరెడ్డి సూచించారు.
నేతలు మాట్లాడుతూ గతంలో ప్రధానీ మోదీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రం మరో ఢాకా కాక ముందే ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజలు, అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్య మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ రాష్ట్ర నేత గొల్లపల్లి ఫణిరాజ్, కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, నవరంగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జలీల్, అమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల పరమేష్, ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు, సీపీఐ జిల్లా నేత లంక గోవిందరాజు, ప్రత్యేక హోదా జేఏసీ స్టేట్ కన్వీనర్ మర్ని రాజా శ్రీనివాసరావు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య, రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చేరుపోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …