విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏ.పి పోలీస్ సంయుక్త ఆద్వర్యంలో రేపు 20.08.2024 (మంగళవారం) సాయంత్రం 7.00 గంటలకు కాండిల్ ర్యాలి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ కలకత్తా లో డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఈ ర్యాలిని నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగళపూడి అనిత వస్తున్నారని ఆమె అన్నారు. ఈ ర్యాలి బందరు రోడ్డు లోని డి.వి మేనర్ హోటల్ నుండి పి.బి సిద్దార్ధ అకాడమి వరకు జరుగుతుందని ఆమె అన్నారు. ఐ.ఎ.డి.వి.యల్, యఫ్.ఒ.జి.యస్.ఐ. కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఐ.డి.ఎ, రోటరి క్లబ్ ఆఫ్ అమరావతి, మహిళలు, వాలంటీర్లు తదితరులు పాల్గొంటున్నారని ఆమె అన్నారు.
Tags vijayawada
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …