Breaking News

జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 ఇప్పటివరకు 96 571 ఎకరాల్లో పంట నమోదు

-జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 ఇప్పటివరకు 96,571 ఎకరాల్లో పంట నమోదు చెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ , పౌర సరఫరాల శాఖ అధికారులతో , కొవ్వూరు డివిజన్ మండల తాహసిల్దార్లుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎస్.చిన్న రాముడు మాట్లాడుతూ ఈ – పంటలో వివరాలు నమోదు ద్వారా వ్యవసాయ , అనుబంధ శాఖలోని అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగు తుందన్నారు. పంటల భీమా, ధాన్యం కొనుగోలు తదితర వివరాల్ని వెబ్ ల్యాండ్ తో కూడి పంట సాగు ధ్రువీకరణ పత్రాలు మరియు ఈ – ఫిష్ డేటా లతో అనుసంధానించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ ఈ – పంట ను ఆగస్టు ఒకటో వ తేదీ నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో వ్యవసాయ సాగు విస్తీర్ణం 1 ,72,494 ఎకరాలు, ఉద్యానవన సాగు విస్తీర్ణం 1,37,759 ఎకరాలుగా ఉందన్నారు. జిల్లా లో వివిధ పంటలకు 3,10,253 ఎకరాలు మొత్తం సాగు విస్తీర్ణంలో ఉందన్నారు. ఈ – పంట నమోదు చేయడాని కి 15.9. 2024 వరకు మాత్రమే అవకాశం ఉందని ఈ లోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఈ- పంట నమోదు నూరు శాతం అమలు అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు. ఈ పంట నమోదు ప్రక్రియ వచ్చేనెల 5వ తేదీ నాటి కి జిల్లాలో నూరు శాతం పూర్తి కావాలని అధికారులకు లక్ష్యంగా చేసుకుని ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పంట సాగు ధ్రువపత్రా లను రైతులకు వెంటనే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు అందజేయాలని పర్యవేక్షించాలని తహసిల్దారు లను ఆదేశించారు. కెఆర్సిసి డిప్యూటీ కలెక్టర్ కొవ్వూరు ఇంచార్జీ ఆర్.డి.ఓ ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ, ఈ పంట నమోదు త్వరితగ తిన పూర్తి చేయాలని ఈ నెలాఖరు నాటికి పూర్తిగా ఈ పంట నమోదు చేయాలని , అమెరకు రైతు లకు అవగాహ న కల్పించి పంట నష్టపోయి నప్పుడు పంటల బీమా పథకం మరియు ఇతర ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకు ఈ పంట నమోదు తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో దాదాపు 30 వేల హె క్టార్లలో ఖాళీ భూములు ఉన్నా యని వీటిని అంచనా వేసి పంట సాగుకు ఏ విధంగా ఉపయో గపడతాయో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేసారు. ఈనెల మూడవ వారంలో జరిగే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనే విధంగా చైతన్యం క ల్పించాలని ఇందుకు సంబం ధించిన ఎలుకలమందు ఇప్పటికే వ్యవసాయ శాఖ కార్యాల యమునకు చేరవేయడం జరిగి నదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలియ జేసారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ టెక్నికల్ ఏవో, ఈ పంట వెబ్ మొబైల్ అప్లికేష న్ ఖరీఫ్ 2024 పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

జిల్లా పౌరసరఫరాల అధికారి పి. విజయ భాస్కర్ మాట్లాడుతూ మండలాల్లో పౌరసరఫరాల డిప్యూటీ తాహసిల్దారులు, తాహాసిల్దారులు సంబంధిత రేషన్ దుకాణాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయుచున్నామని తెలియ జేశారు. రైస్ మిల్లు దగ్గర నుండి ముందుగా 50% గన్ని బ్యాగ్స్ తీసుకొని రై తులకు అందుబాటులో ఉండే విధంగా రైతు సేవా కేంద్రాల్లో ఉంచాలన్నారు. రైస్ మిల్లులు కెపాసిటీ నిర్ధారించేందుకు రైస్ మిల్ లను తనిఖీలు నిర్వహించి, వాటి నిలవ సామర్థ్యం నిర్ధారించాలన్నా రు. ప్రతి రైస్ మిల్లుకు కస్టోడియన్ ఆఫీసర్, పెద్ద మిల్లులకు సిఎస్ డి టి లు, చిన్నమిల్లులకు ఆర్ఐ వీఆర్వోలను నియమించడం జరుగుతుందని తెలిపారు. అక్రమ నిల్వలు, పిడిఎస్ కొనుగోలు, జరగకుండా రైస్ మిల్లులపై నిఘా ఉంచాలన్నా రు. జిల్లా సివిల్ సప్లై అధికారి టి. రాధిక మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అవసరమైనటు వంటి సామాగ్రిని, సాంకేతిక అంశాలను సమకూర్చుకుని ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేసినారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్, జిల్లా ఉద్యాన శాఖ అధి కారి, బి. సుజాత కుమారి వ్యవసాయ శాఖ అధికారులు, కొవ్వూరు డివిజన్ తాహిసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *