-ప్రతీ ఒక్క సాగు విస్తీర్ణం ఈ పంటగా నమోదు
-జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 96% సీసీ ఆర్సి కార్డులు నమోదు 48 వేల ఎకరాల లో ఈ పంట (ఈ క్రాప్ బుకింగ్) నమోదు జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ , పౌర సరఫరాల శాఖ అధికారులతో , కొవ్వూరు డివిజన్ మండల తాహసిల్దార్లుతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెసి ఎస్.చిన్న రాముడు మాట్లాడుతూ , డివిజన్ పరిధిలో ఈ – పంటలో భాగంగా వ్యవసాయ రంగంలో 85,684 ఎకరాలు, హార్టికల్చర్ రంగంలో 50,372 ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఉందన్నారు. సదరు సాగు భూములను ఈ క్రాప్ లో ప్రభుత్వం అమలు చేసే రాయితీ లు సబ్సిడీ నమోదు ద్వారా వ్యవసాయ , అనుబంధ శాఖలోని అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగు తుందన్నారు. జిల్లాలో నూరుశాతం సీసీ ఆర్సీ కార్డులు లక్ష్యంలో 53,060 కి గాను 50,907 మందికి జారీ చేసినట్లు తెలిపారు. ఈ క్రాప్ బుకింగ్ లో 136056 ఎకరాలకు గాను 48 వేల ఎకరాలలో నమోదు చేయగా బిక్కవోలు 59 శాతం, గోకవరం 54 శాతం సాధించగా, సీతా నగరం 15 శాతం, రాజమండ్రి రూరల్ 16 శాతం సాధించి దిగువ స్థానంలో ఉన్నాయన్నారు. ప్రధామ స్థానంలో ఉన్న వారీ నుంచి స్ఫూర్తి పొందాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు.
పంటల భీమా, ధాన్యం కొనుగోలు తదితర వివరాల్ని వెబ్ ల్యాండ్ తో కూడి పంట సాగు ధ్రువీకరణ పత్రాలు మరియు ఈ – ఫిష్ డేటా లతో అనుసంధానించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ ఈ – పంట ను ఆగస్టు ఒకటో వ తేదీ నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనే విధంగా చైతన్యం కల్పించాలని ఇందుకు సంబంధించిన ఎలుకల మందు ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగినదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలియ జేసారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ టెక్నికల్ ఏవో, ఈ పంట వెబ్ మొబైల్ అప్లికేష న్ ఖరీఫ్ 2024 పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి పి. విజయ భాస్కర్ మాట్లాడుతూ డివిజన్ మండలాల్లో రేషన్ దుకాణాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు, రైస్ మిల్లు దగ్గర నుండి ముందుగా 50% గన్ని బ్యాగ్స్ తీసుకొని రైతులకు ఆయా కొనుగోలు, రైతు సేవా కేంద్రాలలో సిద్ధంగా ఉంచాలన్నారు. రైస్ మిల్లులు కెపాసిటీ నిర్ధారించేందుకు రైస్ మిల్ లను తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రతి రైస్ మిల్లుకు కస్టోడియన్ ఆఫీసర్, పెద్ద మిల్లులకు సిఎస్ డి టి లు, చిన్నమిల్లులకు ఆర్ఐ వీఆర్వోలను నియమించడం జరుగుతుందని తెలిపారు. అక్రమ నిల్వలు, పిడిఎస్ కొనుగోలు, జరగకుండా రైస్ మిల్లులపైసిసి కెమెరాల నిఘా ఉంచాలన్నా రు.
జిల్లా సివిల్ సప్లై అధికారి టి. రాధిక మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కోసం అవసరమైనటు వంటి సామాగ్రిని, సాంకేతిక అంశాలను సమకూర్చుకుని ధాన్యం కొనుగోలు చెయ్యాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కే ఎల్ శివ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు , జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్, జిల్లా ఉద్యాన శాఖ అధి కారి, బి. సుజాత కుమారి , పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక ఆర్డీవో కార్యాలయం నుంచి మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, తాహసిల్దార్లు టెలి కాన్ఫరెన్స్ ద్వారా తదితరులు పాల్గొన్నారు.