Breaking News

శ్రీకాళహస్తి సమీపంలోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించి తనిఖీ చేసిన కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

-కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ వారు చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు అభినందనీయం: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-సిఎస్ఆర్ కింద ఈఎస్ఎల్ కంపెనీ వారు చేపట్టిన పలు శిక్షణ కార్యక్రమాల లబ్ధిదారులకు, విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, కుట్టు మిషన్లు, సైకిల్ తదితరాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సి ఎల్ కంపెనీ నీ సందర్శించి తనిఖీ చేసి, వారు చేపట్టిన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా (CSR) ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ వారు చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తి సమీపంలోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వారు సిఎస్ఆర్ కింద చేపట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులకు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను సదరు కంపెనీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, యాజమాన్యాలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా తమవంతు ప్రజోపయోగ సమాజ సేవ కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ కోరారు. గౌ. ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ ప్రాధాన్యతగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, పలు కంపెనీ లలో ఉద్యోగ ఉపాధి కల్పించేలా పలు చర్యలు చేపడుతున్నారని, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్లాంట్ నందు అవసరమయ్యే యువతకు సదరు కోర్సుల నందు నిరుద్యోగ యువతకు, చదువు పూర్తిగా మానేసిన యువతకు శిక్షణ ఇచ్చి వారికి సదరు కంపెనీ నందు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గౌ. ముఖ్యమంత్రి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విత్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ విధానంలో పలు కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు.. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కూడా చాలా ముఖ్యం అని గౌ. ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. త్వరలో స్కిల్ సెన్సస్ జరపనున్నామని తెలిపారు.

సురేష్ ఖండేల్వాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీకాళహస్తి వర్క్స్ మాట్లాడుతూ సి ఎస్ ఆర్ కార్యక్రమాల ద్వారా శ్రీకాళహస్తి మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి వారికి జీవనోపాధిని కల్పించడం, వైద్య ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారతను పెంపొందించే పలు కార్యక్రమాలు చేపడుతున్నామని గత కొన్ని సంవత్సరాలుగా కంటి పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు, ప్రతిభ కనబరిచిన విద్యార్తినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, వ్యవసాయ కళాశాళల ద్వారా రైతులకు సరికొత్త వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ ప్లాంట్ నందు 6000 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 300 ఆవులను కబేళాలకు తరలకుండా వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు తదితర సహాయ సహకారాలు సిఎస్ఆర్ కింద చేపట్టాం అని తెలిపారు.

సీనియర్ జీఎం దొరై రాజు వివరిస్తూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని పలువురికి టైలరింగ్ శిక్షణ 100 మందికి ఇచ్చామని, ప్లంబింగ్ అండ్ శానిటరీ కోర్సు, ఎలక్ట్రికల్ వైరింగ్, కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాం తదితర స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, పాఠశాలలోని 6వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు తొండమ నాడు, రాచగున్నేరి, చిందేపల్లి ఐదు గ్రామాల యువతకు విద్యార్థులకు వారికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. బ్యూటీషన్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

కలెక్టర్ చేతుల మీదుగా టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ అక్షరాస్యత మరియు ఊర్జా అభియాన్ అనే మూడు ముఖ్యమైన సిఎస్ఆర్ కార్యక్రమాలలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్లు, పలువురికి కుట్టు మిషన్లు, సైకిల్, ప్రశంసా పత్రాలు తదితర బహుమతులు అందజేశారు. అనంతరం సదరు ప్లాంట్ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గోశాలను సందర్శించి, ఈ ఎస్ ఎల్ ప్లాంట్ ను పరిశీలించారు.

కంపెనీ ముఖ ద్వారం వద్ద రాచ గున్నేరి, కాపు గున్నెరి, చిండేపల్లి, చటర్జీ నగర్, చల్ల పాలెం, బిసి కాలనీలు, సమీప గ్రామ ప్రజల కొరకు ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సాలయంలో సమీప గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయం అందించేలా ఓపిడి సెంటర్ నందు గైనకాలజిస్ట్ సదుపాయం కల్పించిన సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *