రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా బదలీ పై వెళ్ళిన జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ జిల్లాకు అందించిన సేవలు సర్వదా అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జెసి కి జిల్లా అధికారులు, సిబ్బంది సన్మానించడం జరిగింది. జిల్లాలో పనిచేసిన 18 నెలల కాలంలో మరిచిపోలేని అనుభూతి కలిగించిందని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా వెళుతున్న ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. తాను జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన కాలంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఖచ్చితంగా తెలిసిన విషయాలను గురించి మాట్లాడే వారే నిజమైన విజ్ఞులు, ఆ కోవకు చెందిన వ్యక్తి తేజ్ భరత్ అన్నారు. బిట్స్ పిలాని స్టూడెంట్ గా ప్రతిభావంతుడే కాకుండా, మంచి చిత్రకారుడు ఆయనలో ఉన్నారు. అందుకే తేజ్ భరత్ చేసే పనుల్లో ఎప్పుడు కొత్తదనం చూపడానికి కారణంగా నిలిచిందని పేర్కొన్నారు. మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఆయన చేసిన కృషి అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు , మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, ఆర్డీవో లు కె ఎల్ శివ జ్యోతి , ఆర్ కృష్ణ నాయక్, వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు దొరయ్య, తదితరులు పాల్గొన్నారు. రెవిన్యూ సంఘ ప్రతినిధులు బాపిరాజు, కాంతి ప్రసాద్, అధికారులు మాధవరావు, బి. బాలస్వామి, కలక్టరేట్ ఏ వో పాపా రావు, బాజీరావు తదితరులు ప్రసంగించారు.