అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుపై అధికారులతో బుధవారం నాడు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా..ప్రాజెక్టు వివరాలు, పెండింగ్ పనులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. స్మృతి వనం ప్రాజెక్టును ఏపీఐఐసీ నిర్మిస్తోందని, దాని నిర్వహణ బాధ్యతలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చూస్తుందన్నారు. నిర్వహణ బాధ్యతలు ఎవరు చూడాలని దానిపై క్లారిటీ లేదని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.స్మృతివనం నిర్వహణ బాధ్యతలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చూడాలని మంత్రి సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి. కన్నబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య వేణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …