Breaking News

అచ్యుతాపురం సెజ్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మంత్రి టి.జి భ‌ర‌త్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన‌కాప‌ల్లి జిల్లా రాంబిల్లి మండ‌లం అచ్యుతాపురం ఫార్మా సెజ్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీతో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య‌ సేవ‌లు అందించాల‌ని చెప్పారు. హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో ఫోన్‌లో మాట్లాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని టి.జి భ‌ర‌త్ కోరారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు అక్క‌డే ఉండి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని ఆయ‌న‌ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *