-రోడ్డు భద్రత దృష్ట్యా మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించండి
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా , అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 14.9.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల లలోగల కోర్టులలో ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడునని తెలిపారు.
జ్యుడీషియల్ నాలుగు డివిజన్ల పరిధిలో 79,750 కేసులు పెండింగ్లో ఉన్నవని, ఇందులో పరిశీలించగా రాజీ చేసుకోదగిన కేసులు 39 వేల వరకు ఉన్నాయని పేర్కొన్నారు. సివిల్ కేసులు శాతం ఎక్కువుగా ఉన్నాయని, క్రిమినల్ కేసులు కక్షిదారులు రాజీవ్ మార్గం చేసుకోవచ్చునన్నారు. కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుందని, దీనిపై ఆపిల్ కూడా అవకాశం ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 21 మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయని, సెప్టెంబర్ 14వ తేదీ శనివారం దాదాపు 42 నుంచి 45 బెంచీల వరకు ఏర్పాటు చేసి కక్షిదారులు, అడ్వకేట్స్, మెంబర్స్ సమక్షంలో కేసులు రాజీవ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో మూడు ప్రత్యేక లోకాదాలత్ లు, మూడు జాతీయ లోకాదాలత్ లను నిర్వహించుకోవడం జరిగిందని, ఇందుమూలంగా దాదాపు రు. 100 కోట్లకు పైగా కక్షిదారులకు పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా రెండు మెగా లోకాదలత్ ను నిర్వహించి ఒక్కొక్క లోకాదలత్ సంబంధించి రు. 31 కోట్ల రూపాయలు కక్షిదారులు లబ్ధిదారులకు పరిహారాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు.
కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు ది. 14.9.2024 న (శనివారం) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను ఆయా కోర్టుల నందు పరిష్కరించు కొనవలసినదిగా తెలియజేసారు. రోడ్డు భద్రత దృష్ట్యా మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించి వారి ప్రాణాలను వారే కాపాడుకోవాలని సూచించారు. పత్రికా సమావేశంలో డిఎల్ ఎస్ ఏ కార్యదర్శి కే ప్రకాష్ బాబు పాల్గొన్నారు.