Breaking News

వందే భారత్ రైల్ ఏలూరు లో హల్ట్

-రైలుకు జెండా ఊపిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
‘వందే భారత్’ రైలు ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులో రావడంలో జిల్లా సామజిక, ఆర్ధిక అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ప్రతిష్టాత్మక ‘వందే భారత్’ రైల్ కు ఏలూరు లో హల్ట్ వచ్చిన సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, జనసేన, బిజెపి నాయకులు.లు ఆదివారం సాయంత్రం ఏలూరు రైల్వే స్టేషన్ లో ‘వందే భారత్’ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వందే భారత్ రైలుకు ప్రజల నుండి ఆదరణ ఉందన్నారు. ఏలూరు జిల్లా వ్యవసాయ, పారిశ్రామికంగా,ఆక్వా పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని, వ్యాపారులు, ప్రజలు వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాలకు తక్కువ సమయంలో వెళ్లేందుకు వందే భారత్ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. వందే భారత్ రైలు కు ఏలూరు లో హాల్ట్ కు కృషిచేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను మంత్రి అభినందించారు.
ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ వందే భారత్ రైలు హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాలకు వెళ్లే వ్యాపారులు, ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఎన్నికల సమయంలో ఏలూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు వందే భారత్ రైలుకు ఏలూరు స్టేషన్ లో హాల్ట్ గురించి కోరారని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లకు ఎంపీ ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పి .ఈ. ఎడ్విన్, సీనియర్ డీఈఈ టి. సురేష్, సీనియర్ డిఓఎం సత్య స్వరూప్, సీనియర్ డిఎస్టిఈ ఎండి. ఆలీఖాన్, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి రామకృష్ణ, గన్ని వీరాంజనేయులు, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ప్రముఖులు ఎంఆర్ డి బలరాం, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *