-“భక్తుల భద్రతే పరమావధి” గా ప్రణాళిక అమలు చేయనున్న పోలీస్ శాఖ
-పార్కింగ్ ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేసి అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 4వ తేదీ నుండి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ముందస్తు చర్యలో భాగంగా ఇప్పటినుండే అమలు చేయవలసిన ప్రణాళికపై కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఔటర్ రింగ్ రోడ్డు, పార్కింగ్ ప్రాంతాలు, తదితర ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు చేసి అధికారులతో సమీక్ష జరిపారు. భక్తులు..యాత్రికుల భద్రతే పరమావధిగా భావించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, తధానుగుణంగా కార్యచరణ చేపట్టాలని..డాగ్ స్క్వాడ్, బీడీ టీం, స్పెషల్ పార్టీ పోలీసులతో అప్ ఘాట్/ డౌన్ ఘాట్ రోడ్డు లను నిరంతరం కూంబింగ్ చేయాలని సూచించారు అలాగే ప్రస్తుతం ఉన్న భద్రత ఏర్పాట్లను సమీక్షించి, రాత్రి వేళ తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కొరకు ప్రణాళిక బద్ధమైన కార్యాచరణ అమలు చేయాలని అవసరమైన పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని తిరుపతి అలిపిరి చేక్ పాయింట్ నుండి తిరుమల GNC టోల్గెట్ వరకు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరావు పరిపాలన, తిరుమల డీఎస్పీ , వియజశేఖర్ సీఐలు, విజయకుమార్. రాములు ఎస్సైలు, పలుభాగాల అధికారులు పాల్గొన్నారు.