-గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు రాష్టంలో ఉన్న ఇసుక వివరాలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 62 స్టాక్‌యార్డుల ద్వారా వియోగదారులకు ఇసుక సరఫరా అవుతుండగా, జూలై 8 నుండి సోమవారం వరకు 21,47,883 మెట్రిక్ టన్నుల ఇసుక కొనుగోలు దారులకు చేరిందన్నారు. సీఎం సూచనల మేరకు బుకింగ్ కేంద్రాలను ప్రాత్యేకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. 26వ తేదీన 22,114 మెట్రిక్ టన్నుల మేర 1,748 బుకింగ్‌లు జరిగాయన్నారు. 1609 ఆర్డర్లకు గానూ 20,552 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. రాష్ట్రంలో ఇసుక ముగింపు నిల్వ 16,63,263 ఎంటి గా ఉందన్నారు. 139 ఆర్డర్‌లకు సంబంధించి 1,562 ఎంటి ఇసుక డెలివరీ పెండింగ్‌లో ఉందని, అది కూడా పొద్దుపోయే సమయానికి పూర్తి అవుతుందని మీనా పేర్కొన్నారు.