మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా క్యూలో నిలబడి వారి సతీమణి, తండ్రికి కలిపి మూడు టోకెన్లను కొనుగోలు చేసి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ను పున ప్రారంభించగా, మరుసటి రోజు రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులు వారి నియోజకవర్గాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. మచిలీపట్నం తహసిల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …