-విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వన్ టౌన్ నుంచి రాజరాజేశ్వరి పేట మీదుగా బుడమేరు కాలువకు ప్రవహించే ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ ను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాజా రాజేశ్వరి పేట లో అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధాన ఔట్ఫాల్ డ్రైన్ లో వ్యర్ధాలను తొలగించాలని ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేస్తూ, ఔట్ ఫాల్ డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని వన్ టౌన్ నుండి రాజరాజేశ్వరి పేట మీదుగా బుడమేరు కాలువ వరకు ప్రవహించే ప్రధాన అవుట్ఫాల్ట్ డ్రైన్ ప్రవాహానికి ఆటకం లేకుండా సులభతరంలో మురుగునీరు ప్రవహించేటట్టు అవసరమయ్యే మధ్యలో ఇతర ఏ డ్రైన్లు కావాలన్నా, సత్వరమే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రాజరాజేశ్వరి పేటలో తన పర్యటిస్తున్నప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం గమనించి పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, సైడ్ కాలవల్లో పూడికలను ఎప్పటికప్పుడు తీసివేయాలని అందుకు అధికారిలు తగిన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, బిల్డింగ్ మరియు కన్స్ట్రక్షన్ వ్యర్ధాలను సానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు పట్టణ ప్రణాళిక విభాగం వారి సమన్వయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు జోనల్ కమిషనర్ 2 ప్రభుదాస్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి. రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రామ కోటేశ్వరరావు, సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News