-ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి
-కృష్ణమందిరాల నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా సహాయసహకారాలు
రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ, దుర్గాపురం, అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణపరమాత్ముడు దయతో ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు ఆనందంగా ఉండాలని.. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు, గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడవాలని.. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీగారి నేతృత్వంలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల కృష్ణభక్తులు కృష్ణ మందిరాలు నిర్మించాలని భావిస్తున్నారని.. రాజకీయాలకు అతీతంగా వారికి సహాయసహకారాలు అందించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.