Breaking News

క్రీడాకారులతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 29వ తేదీన నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞను క్రీడాకారులతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి, డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోచ్ లు కలిసి చేయించడం జరిగింది. చురుకైన, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి నా ఫిట్నెస్, ఆరోగ్యం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయిస్తాను.. నా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తాను.. అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా కోచ్ లు పి.రవికుమార్, ఫుట్ బాల్ కోచ్ జగదీష్, కబడ్డీ కోచ్ ఇసాక్, బాక్సింగ్ కోచ్ స్వామి, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ సంతోష్, బాస్కెట్ బాల్ కోచ్ భాస్కర్, వాలీబాల్ కోచ్ రామాంజనేయులు, యోగా కోచ్ ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *