Breaking News

ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం

-ప్రత్యాన్మయ మార్గాలు ద్వారా అదనపు ఆదాయం సాధ్యం
-విలువ ఆధారిత ఆదాయం సాధ్యం
-ఆగరబత్తుల యూనిట్స్ స్థాపన కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి
-పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పూల వ్యర్ధాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతోపాటు, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ హోల్ సేల్ పూల మార్కెట్ నిర్వాహకులు ప్రతినిత్యం ఇరిగేషన్ కాలువల పూల వ్యర్ధాలను వేయడం ద్వారా పరీక్షంగా పరోక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారుకులవుతున్నారని తెలిపారు.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పూల వ్యర్ధాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడం సాధ్యమవుతుందన్నారు. అందుకు ఎన్నో సానుకూల అంశాలు అందుబాటులో ఉన్నాయని వాటిని అధ్యయనం చేసి కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ వనరుగా మార్చుకోవడం సాధ్యమవుతుందన్నారు. పూల వ్యర్ధాల కోసం డంపింగ్ యార్డ్ ప్రతిపాదన వల్ల ఉపయోగం కంటే, ఇబ్బందికర పరిణామాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పూల వ్యర్ధాలను డీకంపోస్టు చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేయవచ్చునని స్పష్టం చేశారు. కూలింగ్ ప్రాసెసింగ్ విధానంతో, పూలను ఎండబెట్టడం ద్వారా వాటి యొక్క రంగు పోకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుని, దేశీయ విదేశీయ మార్కెటింగు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. పూల నుంచి అగరబత్తులు తయారు చేసే విధానం ఉందని, అందుకోసం తక్కువ పెట్టుబడి పెట్టడం కోసం ముందుకు రావాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. గులాబీల, ఇతర సుగంధ పూల నుంచి సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పద్ధతి అభివృద్ధి చేయడం పై ముందుకు రావాలని కోరారు. విలువ ఆధారిత ఆదాయం సాధ్యం ఉందని ఆమేరకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలని సూచించారు.

జిల్లా గ్రామపంచాయతీ అధికారి పూల మార్కెట్ ప్రాంతంలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. ఇక్కడ సరైన పర్యవేక్షణా చేపట్టాలన్నారు. అందులో భాగంగా సాలిడ్ , లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేపట్టే దిశగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి రెండు మూడు ప్రత్యన్మయ మార్గాలు చూపాల్సి ఉంటుందన్నారు.

అనంతరం పర్యటక శాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యాటక పరంగా జిల్లాలో ప్రతిపాదించిన వివిధ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ పనులు, భూముల వివరాలు, వాటికీ రావలసిన పరిపాలన అనుమతులు తదితర అంశాలపై టూరిజం ఆర్ది వి స్వామి నాయుడు, ఎపిఏమ్ఐపి పిడి దుర్గేష్, డిటివో ఎంపిడిఓ కే. రత్న కుమారి తదితరులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పిడి ఏపీఎంఐపి ఏ. దుర్గేష్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, ఫ్లవర్ మార్కెట్ యూనియన్ ప్రతినిధులు జి. నాగేశ్వర రావు, పి. వెంకన్న బాబు, పి. సత్తి రాజు, జి. దుర్గారావు, పి. రామకృష్ణ, ఎమ్. వీరబాబు, ఈ. దొరబాబు , ఏ. త్రిమూర్తులు , సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *