-తెలుగులో చదవండి, రాయండి, మాట్లాడండి
-తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులను సన్మానం
-ఆకట్టుకున్న గేయాల, కవితల సమాహారం గిడుగురామ్మూర్తి వారికి ఘన నివాళి
-ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , జెసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం కలక్టరేట్ లో గిడుగురామ్మూర్తి పంతులు 162 వ జన్మ దినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, తెలుగు భాషా పండితుడు శ్రీ గిడుగు రామ్మూర్తి కి ఒక విశిష్టమైన స్థానం కలిగివుందని అన్నారు. వాడుకభాష ఉద్యమ కారుడుగా ఆయన చేసిన కృషి వలన తెలుగు భాషకి మంచి ప్రాచుర్యం లభించిందని పేర్కొన్నారు. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, అందరికి తెలియజెప్పిన మహనీయుడన్నారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు అన్నారు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింప జేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు అని పేర్కొన్నారు. మన మాతృ భాష ను గౌరవించుకోవడం ముఖ్యం అని, నేడు భాషను మర్చిపోయే పరిస్థితికి రావడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. తెలుగు వారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుగులో చదవండి, రాయండి, మాట్లాడం చెయ్యాలనీ పిలుపు నిచ్చారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు.వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైందన్నారు.. అటువంటి వారిని స్మురణ కు తెచ్చుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం పోరాటం సహజం, అయితే భాషా కోసం ఉద్యమం చేసే గొప్పవ్యక్తి గిడుగు అన్నారు. మన మాతృ భాష పై పట్టు ఉన్నప్పుడే చక్కగా అవగాహాన సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. రామూర్తి కి ప్రతి ఒక్కరం కృతజ్ఞతలు తెలియ చెప్పాల్సి ఉందన్నారు. సవర భాషలో ఉన్న సాహిత్యాన్ని మనకు తెలియచేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. తెలుగులో రెండు నిమిషాలు అనర్గళంగా మాట్లాడడం సాధ్యం కానీ పరిస్థితులను నేడూ చూస్తున్నాం అన్నారు.
ఈ సందర్భం గా వక్తలు మాట్లాడుతూ, తెలుగు భాష అంటే గుర్తుకు వొచ్చే వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు గారు అని పేర్కొన్నారు. .. ఇతర భాషల పట్ల ఆసక్తి ఉండవచ్చు, కానీ మాతృ భాష విషయములో ఎటువంటి నిర్లిప్తత తగదని తెలిపారు. మన భాష మనకు గుర్తింపు, మన సంస్కృతి , సాంప్రదాయాలు తెలుసుకోవడానికి మాతృ భాష పై ఆధారపడి ఉంటుందన్నారు.
కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యతగా తెలుగు ఉపాధ్యాయులు గొల్లపల్లి సత్యనారాయణ వ్యవహరించారు. మాతృ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపాధ్యాయులు వల్లించిన సాహితీ పద్యాలు, పాటలు, కవితలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు” గిడుగు ” గొల్లపల్లి సత్యనారాయణ, ” అమ్మ పాలు “పై బి ఏసుబాబు, గిడుగు రామ్మూర్తి జీవిత విశేషాలపై విద్యార్థి కిషోర్ , వాడుక భాష తెలుగు పై నాలుగో తరగతి విద్యార్థి విధేయత ఇచ్చిన ప్రసంగం, మాస్టారు పాడిన ” గ్రాంధికం ” ” ఆప్యాయత ” ” తెలుగు వెలుగు” కవితలు , ఉపాధ్యాయురాలు జ్యోతి పాడిన ” కృష్ణ శాస్త్రి కవితలా ‘ డిఇఓ వాసుదేవరావు పాడిన కవిత ‘నేను తెలుగును – మీ జాతి వెలుగును” మాస్టర్ తాయారమ్మ పాడిన చక్కని పలుకుల చాంగబళ , విద్యార్థినీ నవ్య పాడిన గడిచి పోయినట్టి ” గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డిఆర్ఓ జి నరసింహులు, జిల్లా విద్యాధికారి కె వాసుదేవరావు, ఉపాధ్యాయులు , విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.