రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో శాఖపరమైన అధికారులు పరిష్కరించాలని కే ఆర్ ఆర్ సి ఎస్ డీ సి ఆర్ కృష్ణ నాయక్ , జిల్లా సహకార సంఘాల అధికారిఆర్ . శ్రీరాములు నాయుడు లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి తరుపున జిల్లా అధికారులు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ కడలి వేంకటేశ్వర రావు, కే ఆర్ ఆర్ సి ఎస్ డీ సి ఆర్ కృష్ణ నాయక్ , జిల్లా సహకార సంఘాల అధికారిఆర్ . శ్రీరాములు నాయుడు, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ డి. బాల శంకర్ రావు, కలెక్టరేట్ ఏవో పి .. పాపా రావు, తదితరులు అర్జీలు స్వీకరించారు.
జిల్లా స్థాయి ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో 144 అర్జీలు ప్రజల నుండి స్వీకరించా మన్నారు. ప్రజా సమస్యల సత్వరం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈమేరకు అర్జీలు సత్వర పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు.
కొన్ని అర్జీలు..
నిడదవోలు మండలం సమిశ్ర గూడెం గ్రామానికి చెందిన బుద్దేటి ఈశ్వర ప్రసాద్ వారి అర్జీల వివరిస్తూ తాను నివాసం ఉంటున్న ఏరియాలో మా పక్కన ఉంటున్న అనసూయమ్మ అక్రమంగా నడక దారిలో ఇల్లు నిర్మించుకోవడం వలన ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని, కావున ప్రజలందరికీ ఉపయోగపడే నడకదారి ఇప్పించవల సిందిగా వారు అర్జీలు కోరారు.
జిల్లాలోని 20, 30 సంవత్సరా ల నుండి రేషన్ డీలర్లు గా అన్ని మండలాల్లో డ్వాక్రా గ్రూపు తరఫున కొన్ని షాపులు నిర్వహిస్తున్నాము. గతంలో ఐదు నోటిఫికేషన్ ఇచ్చిన ఎప్పుడు డ్వాక్రా గ్రూప్ తరపున నిలువెస్తున్న షాప్ లో ప్రస్తావని రాలేదు. 20 30 సంవత్సరాల నుండి ఫ్యాషన్ షాపులు పైనే మా కుటుంబాల ఆధారపడి జీవనం సాగిస్తున్నాము. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చినా ఖాళీగా ఉన్న డీలర్ల షాపులను మాత్రమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని రేషన్ షాపుల ప్రెసిడెంట్, బి. రాజు, జనరల్ సెక్రటరీ ఎం.వెంకటేశ్వరరావు ట్రెజరర్, జి.పృధ్విరాజ్, ప్రజా సమ స్యల పరిష్కార వేదికలో అర్జీ సమ ర్పించారు.
రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామానికి చెందిన వేముల తిరపయ్య, నేను దివ్యాంగు డిని. నాకు 6000 పెన్షన్ మా త్రమే వస్తోంది. నాకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని నాకు ఆన్లైన్ అవ్వట్లేదు. కావున నా యందు దయవుంచి 15 వేల రూపాయలు పెన్షన్ మంజూ రు అయ్యేవిధంగా చూడాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అధికారులకు సమర్పించుకున్నారు.