Breaking News

విజయవాడ – బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా బోయింగ్ కొత్త సర్వీస్

-రాష్ట్రంలో విమాన కనెక్టివిటీ పై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ
-బెంళూరు రాష్ట్ర రాజధానితో బాగా అనుసంధానించబడి ఉంది – నాయుడు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రాజధాని అమరావతిని బెంగళూరుతో అనుసంధానం చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడి విజయవాడ – బెంగళూరు విమాన సర్వీసుల ప్రాధాన్యతను వివరించి సర్వీసులు నడిపేలా ఒప్పించారు. ఇందుకు సంబంధించి ఎయిర్ ఇండియా నేటి నుంచి సరికొత్త సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇక పై రోజూ నడిచే ఈ సర్వీస్ బెంగళూరులో సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి సాయంత్రం 5.40 గంటలకు విజయవాడకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి రాత్రి 7.50 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇప్పటివరకు ATR-72 వంటి చిన్న విమానయాన సంస్థలు విజయవాడ నుంచి సేవలు అందిస్తుండగా, తాజాగా బోయింగ్-737 విమానాలను కేటాయించారు. 176 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ప్రయాణం ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

కేంద్ర మంత్రి విజయవాడ – బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా కొత్త విమానాలు అందుబాటులోకి రావడం పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని ప్రాంతానికి మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లో విజయవాడకి ఇది నాలుగో సర్వీస్. విజయవాడ – ముంబయి, విజయవాడ – ఢిల్లీ మధ్య 2 సర్వీసులు నడపడానికి ఇండిగో ఇప్పటికే ముందుకు వచ్చింది. బెంగళూరు సర్వీస్‌తో 3 నెలల్లోనే విజయవాడకు 4 సర్వీసులను తీసుకురావడానికి కేంద్ర మంత్రిగా నాయుడు చొరవ చూపడాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *