-అపన్న హస్తం అందించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
*బుడమేరు వరద ముంపుతో సర్వం కోల్పోయిన నగరంలోని కబేలా, వించిపేట ,నైజాం గేట్, జ్యోతి నగర్, వన్ టౌన్ ప్రాంతాల్లో బాధితులకు శనివారం జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆపన్నహస్తం అందించారు. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు దుప్పట్లు ,చీరలు ,మందులు, నిత్యాసర సరుకులను పంపిణీ చేశారు. వరద బీభత్సంతో పలు ప్రాంతాల్లోని ఇల్లు ముంపుకు గురి అయ్యాయి. ఇళ్లలో ఉన్న నిత్యవసరాలు తడవడంతో ఇబ్బందులు బాధిత కుటంబాలకు జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, మరియు కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇంచార్జ్శ్రీ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి అండగా నిలిచారు. పోలీసు వారు అందిస్తున్న సేవలకు వితరణగా 2లక్షల రూపాయలు, దుప్పట్లు ఫ్రూట్ బెడ్స్. నగరంలో వరద భాదితులకు పోలీస్ వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి 2లక్షల రూపాయలు నగదుతో పాటు దుప్పట్లు, ఫ్రూట్ బ్రెడ్ ను జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, మరియు కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇంచార్జ్శ్రీ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పంపిణీ చేశారు.