విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన వరదముంపు కారణంగా నష్టపోయిన బాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 2.50 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. మంగళవారం ఉదయం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కమీషనర్ నిశాంత్ కుమార్, డిజియం ఏవీ కృష్ణప్రసాద్ ల సమక్షంలో విరాళం చెక్ ను ఎన్ టీ అర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఎపిఎన్జీఓ అసోసియేషన్ ద్వారా ఇటీవల ముఖ్యమంత్రి సహాయనిధికి ఎక్సైజ్ డిపార్టుమెంటు ఉద్యోగుల నుంచి ఒకరోజు బేసిక్ పే రూ. 75 లక్షలు ఇవ్వడం జరిగిందని ఈరోజు ఎక్సైజ్ ఉద్యోగుల తరపున మరొక రోజు బేసిక్ వేతనం అనగా మరొక రూ.75 లక్షలు తో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (కార్పొరేషన్) ఉద్యోగుల తరపున ఒక కోటి రూపాయలు కలుపుకొని మొత్తం 2.50 కోట్లు ముఖ్యమంత్రి గారికి అందించడం జరిగిందని ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జెఎసి చైర్మన్ ఎస్ వివిఎన్ బాబ్జిరావు సెక్రటరీ జనరల్ బి. నరసింహులు తెలిపారు.
భారీ విరాళాన్ని అందించిన ఉద్యోగులను ప్రిన్సిపాల్ సెక్రటరీ రెవెన్యూ (ఎక్సైజ్) ముఖేష్ కుమార్ మీనా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్, ఏపి ఉద్యోగుల జెఏసి వైస్ ఛైర్మన్ ఎం. కోటయ్య, కో ఛైర్మన్ వివివిఎస్ఎన్ వర్మ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు లావణ్య, ఎస్.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు కామేశ్వరరావు, ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.