Breaking News

వరద ఉధృతి నేపధ్యంలో ముంపు ప్రాంతాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలింపు

-ఇరిగేషన్ పరిథిలో చేపట్టవలసిన అత్యవసర పనులపై సమీక్షా
-వరదలు పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం
-కలెక్టర్ పి ప్రశాంతి, జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ శాఖ హెచ్చరికలు, గోదావరి కి వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు, ముంపు ప్రాంతాల్లో వారిని సమన్వయ శాఖల అధికారులతో కలిసి రెవిన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు, వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికల జారీ చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి సమన్వయ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్, అంతకు ముందు ఇరిగేషన్ అధికారులతో ఇరిగేషన్ కాలువల తక్షణం మరమ్మత్తులు పై సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గోదావరి నది తీర ఎగువ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదు కావడంతో భద్రాచలం, మధ్యప్రదేశ్ , చత్తీస్ ఘడ్ ప్రాంతాల నుంచి వేగంగా వరద నీరు గోదావరి నదికి చేరుతోందన్నారు. ఆమేరకు వాతావరణ శాఖ హెచ్చరికలను చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గోదావరీ నదికి ఎనిమిది లక్షల ఇసుకల క్యూసెక్కుల వరద నీరును ధవళేశ్వరంబ్యారేజీ నుండి దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. సాయంత్రం నాటికి మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో రెండవ ప్రమాద హెచ్చరిక చేరుకుంటుందని తెలిపారు. ముంపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. తగిన ఏర్పాట్లు భోజన వసతి, వైద్య శిబిరం, ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్, నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గర్భిణీలు బాలింతలు చిన్నారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్య సహాయం కోసం అవసరమైతే ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలన్నారు. పునరవాస కేంద్రం నుంచి వెళ్లే సమయంలో రూ.3000 ఆర్థిక సహాయం అందజేయాల్సి ఉంటుందన్నారు. టిఆర్ 27 కింద తగిన ప్రతిపాదనను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని , వైద్య శిబిరాలు, బెడ్ షీట్స్, శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో మానవ , పశువుల ప్రాణా నష్టం లేకుండా చూసుకోవాలన్నారు. రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నియంత్రించాలని పోలీసు అధికారులు ఆమేరకు రెవిన్యూ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని, గోదావరిని చూసేందుకు వొచ్చే దారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.

గోదావరికి వరదల నేపథ్యంలో మంగళవారం, బుధవారం వినాయక నిమజ్జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం అధ్వర్యంలో వాటిని తీసుకుని నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆమేరకు ప్రజలు , నిర్వాహకులు సహకరించాలన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎక్కువగా గణేశ్ నిమజ్జనం ఘట్లు ఉన్నాయని చెప్పారు. నిమజ్జన సమయంలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన యంత్రాంగానికి విగ్రహాలు అప్పగించి సహకరించాలని కోరారు. గోదావరీ లో విగ్రహాలు నిమజ్జనం కోసం రెవిన్యూ, పోలీసు, ఫైర్, మత్స్య పంచాయతీ, మునిసిపల్ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఇరిగేషన్ అధికారులు రాజమండ్రి కొవ్వూరు డివిజన్ పరిధిలో అత్యవసరంగా చెప్పవలసిన చేపట్టవలసిన పనులపై కార్యవర్గ కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆయా పనులను పూర్తి చేయాలన్నారు. రాజమండ్రి డివిజన్లో రెండు పనులు, కొవ్వూరు డివిజన్ లో 6 ఆరు పనులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ కు నివేదిక అందజేశారు.

జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ, రాజమండ్రి, సీతానగరం , నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం తదితర మండలాల్లో ముంపు ప్రాంతాలను గుర్తించడం, అక్కడ నుండి లోతట్టు ప్రాంతాల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడం పై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. సీతానగరం ములకల్లంక ,  రాజమండ్రి అర్బన్ బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురు లంక , పల్లి పాలెం తదితర ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆర్డీవో మాట్లాడుతూ, ఇప్పటికే కలెక్టరు వారి ఆదేశాల మీదగా బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురు లంక కు చెందిన కుటుంబాలను తరలించడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరా పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడడం, వైద్య ఆరోగ్యశాఖ తరపున శిబిరాల నిర్వహణా, మునిసిపల్ , పంచాయతీ ఆధ్వర్యంలో శానిటేషన్, క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. అగ్ని మాపక మత్స్య శాఖ అధికారులు తగిన బోట్లను ,  సిమ్మర్ లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ ఆధ్వర్యంలో ముంపు గురైన పంటల వివరాలను సేకరించాలన్నారు.

ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఇరిగేషన్ అధికారులు కే కాశీ విశ్వేశ్వరరావు, కే రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *