-క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు
-ఒక్కోక్క కుటుంబానికి 15 కేజీల బియ్యం, వారానికి సరిపడ సరుకులు పంపిణీ
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో మంగళగిరి పట్టణంలోని వీవర్ శాల వద్ద క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల కుటుంబాలకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు, టీడీపీ నాయకులతో కలిసి చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వి వనజ 200 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఒకోక్క కుటుంబానికి 15 కేజీల బియ్యం వారానికి సరిపడ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి జీవనోపాధి కోల్పోయిన బాధితులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారని అన్నారు. మంత్రి ఆదేశాలతో వరద బాధితులకు మూడు పూటల ఆహారం, తాగునీరు, పాలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. విపత్తుల నిర్వహణలో సీఎం చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారని అన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాములు తెలియజేశారు.
గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పది రోజులుగా వరదలు వల్ల రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ మొదటి రోజునే మంగళగిరిలో పర్యటించి వరద బాధితులకు అవసరమైన సహయక చర్యలు చేపట్టారని చెప్పారు. జీవనోపాధి కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ జాయింట్ సెక్రటరీ బి సుజాత, కోశాధికారి డి శైలజ, ప్రతినిధులు సి లిలా, డి పద్మ, వై పద్మజ, ఎస్ శశి, పి గౌతమ్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి మండల అధ్యక్షులు తోట పార్థసారథి, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, 1వ వార్డు అధ్యక్షులు సైనాదం శ్రీనివాస్, 10వ వార్డు అధ్యక్షులు కౌతవరపు శ్రీను, 21వ వార్డు అధ్యక్షులు వంగర రమేష్, పార్లమెంట్ సాధికార సమితి సభ్యులు బట్టు శిదానందశాస్త్రీ, టీడీపీ నాయకులు విన్నకోట శ్రీనివాసరావు, జంజనం వెంకట సుబ్బారావు, జంజనం శ్రీనివాసరావు, బూదాటి శ్రీను వంగర హనుమాన్, దివి లక్ష్మి, చిలకా వెంకటేశ్వర్లు, తాడిచర్ల వీరన్న, దామర్ల పద్మజ, దామర్ల రాంబాబు, దివి పిచ్చయ్య, ఇండ్ల రజిని, కేసనం సాయిభావన, గంజి సుధా, గంజి పూర్ణ, కొల్లి శ్రీనివాసరావు, నీలం అంకారావు, రావూరి రవి ప్రసాద్, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొని చేనేత కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.