-అర్హులైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వార 25,000 రూపాయలు దరఖాస్తు రుసుము కొరకు స్కాలర్షిప్ పొందే అవకాశం
-శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులకు జపాన్ దేశంలో నెలకి 1,00,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల జీతంతో ఉద్యోగం పొందే అవకాశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు NAVIS HR ఆధ్వర్యంలో ANM / GNM / B.Sc Nursing చదివిన వారికి జపానీస్ భాష N5, N4, మరియు N3 స్థాయిలలో నేర్పించి, వారికి జపాన్ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాధం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి, 32 సంవత్సరాలు లోపు వయసు ఉన్న అభ్యర్థుల అర్హులని , శిక్షణ కాలం 6 నెలలు అని, శిక్షణ NAVIS HR బెంగళూరులో జరుగుతుంది అని, శిక్షణ ఫీజు 3,00,000 , పాక్షిక శిక్షణ రుసుము 50,000 రూపాయిలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 25,000 రూపాయిలు చెల్లిస్తుంది అని మిగిలిన 25,000 రూపాయిలు అభ్యర్ధి చెల్లించాలి అని మిగిలిన 3,00,000 రూపాయలు NAVIS HR వాళ్ళు లోన్ అవకాశం కల్పించనున్నారు, జాబ్ లో చేరిన తరవాత 12 EMIs లో అభ్యర్ధి చెల్లిoచాల్సింది గా తెలియజేసారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్ దేశం నందు ఉద్యోగ అవకాశం కల్పించటానికి కావాల్సిన సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు NAVIS HR పర్యవేక్షిస్తుంది అని ఉద్యోగం పొందిన అభ్యర్థి కి జీతం 1,10,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది అని తెలియజేసారు.
ఆసక్తి కలిగిన వారు లింక్ https://shorturl.at/FB7ok
వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9885943819,8801346518ను సంప్రదించాలన్నారు.