-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
బిఎల్ఓ లు ఎస్ఎస్ఆర్ -2025 తయారీ నేపథ్యంలో ఇంటింటికి తిరిగి సర్వేను పక్కాగా నిర్వహించి లోపాలు లేని, పారదర్శకమైన ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం రేణిగుంట మండలం స్థానిక పాంచాలి వీధి నందు బిఎల్ఓ లు నిర్వహిస్తున్న ఎస్ఎస్ఆర్ -2025 ఇంటింటి సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పక్కాగా ఇంటింటి ఓటర్ జాబితా వెరిఫికేషన్ నిర్వహించి లోపాలు లేని ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని, ఏదైనా పొరపాట్లు వస్తే సంబంధిత అధికారి బాధ్యులవుతారు అని తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంటిలోని వారి పీఎస్ఈ, డిఎస్ఈ ఓటర్ వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని అందులోని ఫోటో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉందా అని చూసి అవసరమైతే మరొక సారి ఫోటో సేకరించాలని, కుటుంబంలోని సభ్యుల వివరాలు సరిచూసుకుని వారిలో ఎవరైనా మరొక పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంటే వారితో మాట్లాడి వారి అంగీకారం మేరకు ఒక చోట తొలగించి కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా నిర్దేశిత ఫారం నందు వివరాలు నింపిన మేరకు చర్యలు తీసుకోవాలని, లోపాలు లేని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవి శంకర్ రెడ్డి, తాశిల్దార్ సురేష్, ఎంపిడిఓ విష్ణు, గ్రామ వార్డు బిఎల్ఓ లు తదితర అధికారులు పాల్గొన్నారు.