Breaking News

సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను పునః సమీక్ష చేయాలి…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ. క్రిమిలేయర్ సుప్రీం కోర్ట్ తీర్పు ను రద్దు చేయాలని, మోడీ, రేవంత్ రెడ్డి సర్కార్ లను డిమాండ్ చేస్తూ.. నేడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్బంగా దళిత బహుజన పార్టీ DBP ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక సమితి. మాలమహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వర్గీకరణ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు, సమితి జాతీయ చైర్మన్, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ విగ్రహం ఎదుట రోడ్ మీద పార్టీ బైఠాయించారు. రాజ్యాంగం వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ను పునః సమీక్ష చేసి రద్దు చేయాలని. దీనికోసం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర సర్కార్ తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే దాఖలు చేసిన వంద కు పైగా రివ్యూ పిటిషన్ లు సుప్రీం కోర్ట్ లో పెండింగ్ లో ఉన్నందున.. వర్గీకరణ కు, క్రిమిలేయర్ అమలు కు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టడం సరైనది కాదన్నారు. వర్గీకరణ కు అనుకూలంగా గత ప్రభుత్వం చేసిన అసెంబ్లీ తీర్మానం ను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. వర్గీకరణ కు రేవంత్ రెడ్డి చర్యలు చేపడితే.. కాంగ్రెస్ పైన తిరుగు బాటు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వంనకు సమితి తరుపున లేఖ ను బహిరంగాను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాలమహానాడు (శ్రీకృష్ణ వర్గం)
జాతీయ అధ్యక్షులు పబ్బాతి శ్రీ కృష్ణ, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి వాడాల భాస్కర్, మాలమహానాడు మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సి. హెచ్. రోజాలీల, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అర్షల రాజు, దళిత బహుజన పార్టీ గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పరి సుబ్బారావు, దర్జీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల సుచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *