హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
హైడ్రా కూల్చి వేతల్లో ఇళ్లు కొల్పోయిన పేదలకు ప్రభుత్వం పునర వాసం కల్పించి, నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో నగరంలో చెరువులు, నలాలను కబ్జా చేసిన అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని చెప్పారు. హైడ్రాను తమ పార్టీ స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. హైడ్రా పనితీరుపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నందున రాజకీయాలకు అతీతంగా హైడ్రాను కొనసాగించాలని కోరారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, ప్రజాదరణ పొందిన సిఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్ళకు లొంగ కుండా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని, కబ్జాలకు సహకరించిన అధికారులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమాజ్వాది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Tags hyderabad
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …