Breaking News

ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

-అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేయాలి
-వెబ్ సైట్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలి
-ప్రభుత్వంపై వచ్చే నెగెటివ్ వార్తలపై ఆయా శాఖల ద్వారా వెంటనే వివరణ ఇవ్వాలి
-ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సమాచారశాఖ పని చేయాలి
-అభివృద్ధి సంక్షేమ పధకాలకు చెందిన సమాచారంపై డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలి
-రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖలో పనిచేసే అధికారులు,ఉద్యోగులు సాంకేతిక పరిజ్ణానాన్నిఅలవర్చుకుని మరింత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి చెప్పారు.గురువారం రాష్ట్ర సచివాలయంలో సమాచార శాఖ క్షేత్రాధికారుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాచారశాఖ అంటే ప్రభుత్వానికి కళ్ళు,చెవులు,వంటిదని ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించుటలో ఈశాఖ ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు.కావున అందుకు అనుగుణంగా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ప్రస్తుత ఆధునిక సాంకేతికతను అలవర్చుకుని అధికారులు ఉద్యోగులు వారి వృత్థి నైపుణ్యాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు అవసరమైతే ఆయా రంగాలకు చెందిన నిపుణులతో ఉద్యోగులకు తగిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లాకు మంత్రి పార్ధసారధి సూచించారు.
అదే విధంగా ప్రస్తుతం సమాచారశాఖ అమలు చేస్తున్న ప్రత్యేక వెబ్ సైట్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అభివృద్ధి సంక్షేమ పధకాల సమాచారాన్ని సకాలంలో ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలని మంత్రి పార్ధసారధి చెప్పారు.ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించే రీతిలో సమాచార శాఖ అధికారులు,సిబ్బంది పని చేయాలని అన్నారు.అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ ప్రసార మాద్యమాల ద్వారా విస్తృత ప్రచారానికి కృషి చేయాలన్నారు.ప్రభుత్వంపై ఎక్కడైనా మీడియాలో గాని లేదా సోషల్ మీడియాలో గాని వ్యతిరేక వార్తలు వస్తే వెంటనే సంబంధిత జిల్లా లేదా రాష్ట్ర స్థాయి అధికారులను సంప్రదించి రిజాయిండర్ లేదా వివరణ ఇవ్వడం ద్వారా వాస్తవాలను తెలియజేయాలని మంత్రి పార్ధసారధి సమాచారశాఖ అధికారులకు స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటా బ్యాంకును ఏర్పాటు చేసుకునేందుకు తగిన మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకై ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పార్దసారధి చెప్పారు.అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలకు సంబంధించిన విజయగాధలను మీడియాలో ప్రచురిత మయ్యేలా చూడాలని అన్నారు.
అనంతరం జర్నలిస్టుల ఆరోగ్య పధకం,అక్రిడిటేషన్ ఇతర అజెండా అంశాలపై చర్చించారు.వివిధ ఖాళీల భర్తీ,వాహనాలు సమకూర్చడం వంటి ఇతర వ్యవస్థాపరమైన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని దానిపై ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పార్ధసారధి చెప్పారు.
ఈసమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా మాట్లాడుతూ అక్టోబరు 31 లోగా నూతన అక్రిడిటేషన్ విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. అదే విధంగా జర్నలిస్టుల ఆరోగ్య పధకంలో కూడా కొన్ని మార్పులు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.ప్రభుత్వ పధకాలు,కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సమాచారశాఖ అధికారులు,సిబ్బంది మరింత సమర్ధవంతంగా పనిచేయాలని,సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు,పధకాలపై ఎప్పటి కప్పుడు ప్రత్యేక కధనాలు,విజయగాధలు మీడియాలో ప్రచురితమయ్యే విధంగా పనిచేయాలని చెప్పారు.
అనంతరం జిల్లాల వారీగా ఖాళీలు,సమకూర్చాల్సిన వాహనాలు ఇతర అంశాలపై చర్చిచారు.ఈసమావేశంలో సమాచార సంయుక్త సంచాలకులు,ముఖ్య సమాచార ఇంజనీర్లు, డిప్యూటీ డైరెక్టర్లు,రీజనల్ ఇన్పర్మేషన్ ఇంజనీర్లు,ఎడిలు,డిఐ పిఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు

-జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం – సమ్మె విరమణ -తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి -ఆహారం,పౌరసరఫరాల మరియు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *