-ఆరు కోట్ల మంది వయోధికులకు ప్రయోజనకరం
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా 70 సంవత్సరాలు పైబడినవారందరికీ రూ.5 లక్షల ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ పథకం విస్తరిస్తూ…70 ఏళ్లు పైబడినవారందరికీ రూ.5 లక్షలు ఉచిత ఆరోగ్య బీమాను ఇవ్వడం ద్వారా ఆరు కోట్ల మంది వయోధికులకు ప్రయోజనం కలుగుతుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడానికి ఖర్చులు పెరుగుతున్నాయనే ఆందోళన చాలాకుటుంబాలలోఉంటుంది. ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పథకం ద్వారా అధిగమించవచ్చు. 4.5 కోట్ల కుటుంబాలకు ఇది గొప్ప ఊరటను ఇస్తుంది. సామాజిక, ఆర్థిక తారతమ్యాలకు తావు లేకుండా ఉచిత ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఒక్కరికీ లబ్ధి ఇవ్వాలనే ఉదాత్తమైన పథకాన్ని ప్రవేశపెడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ పథకం ద్వారా కేంద్రంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం దేశ ప్రజల క్షేమాన్ని, అభివృద్ధినీ ఎల్లవేళలా ఆకాంక్షిస్తుందని మరోమారు వెల్లడైంది.