విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“వికసిత్ ఆంధ్ర విసన్2047 “లో భాగంగా మన జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా కలెక్టర్ ఆదేశించి ఉన్నారు. ఇందులో భాగంగా మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 6 నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థినీ విద్యార్థుల కు “వికసిత్ ఆంధ్ర విషన్2047” అనే అంశంపై వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను మండల స్థాయి పోటీలను నిర్వహించి, ప్రతి మండలం నుండి మొదటి మరియు ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులను జిల్లా స్థాయి లో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుచానూరు లో జరిగే జిల్లాస్థాయి పోటీల లో పాల్గొన్నారు. ఎంపిక అయిన విద్యార్థుల వివరాలు. వికసిత్ ఆంధ్ర విజన్@ 2047
వ్యాసరచన పోటీలు
1 ప్రథమ బహుమతి
B. పెంచల పూజిత పదవ తరగతి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ శ్రీకాళహస్తి
2. ద్వితీయ బహుమతి
B. పార్థసారథి పదవ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మ కండ్రిగ
ఆర్ సి పురం మండలం
3 తృతీయ బహుమతి
P. మహాలక్ష్మి ఎనిమిదవ తరగతి
ఏపీడబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ సత్యవేడు
వకృత్వ పోటీలు
1 ప్రథమ బహుమతి
K. వకుల హాసిని పదవ తరగతి
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ తిరుపతి
2 ద్వితీయ బహుమతి
ఎస్ కే నసీహా ఏడవ తరగతి
శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి
3. తృతీయ బహుమతి
K. కృష్ణవేణి పదవ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బండారుపల్లి ఏర్పేడు మండలం.
గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలు అందరి విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుకరించడం జరిగినది. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు ధనంజయ సారథి (ASO), రామచంద్రారెడ్డి (Planning coordinator), డాక్టర్ రాము (ACMO), పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు కోదండపాణి,బ్రహ్మం, లీల ప్రతాప్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులను తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి శేఖర్ అభినందించారు.