-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 18
-జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం/ జీఎన్ఎం/బీఎస్సీ-నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాషను ఎన్5, ఎన్4, ఎన్3 స్థాయిల్లో నేర్పించి, వారికి జపాన్ దేశంలో హాస్పిటల్ యందు కేర్ టేకర్స్ గా ఉద్యోగావకాశలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి, 32 సంవత్సరాల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులు అని తెలియజేశారు.
శిక్షణ కాలం 6 నెలలు ఉంటుందని, . నావిస్ హెచ్ఆర్, బెంగళూరులో నందు శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. శిక్షణ రుసుముగా ఫీజు రూ.3,50,000 గా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాక్షిక శిక్షణ రుసుము గా చెల్లించాల్సిన రూ.50,000 లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రూ.25 వేలు చెల్లించడం జరుగుతుందని, మిగిలిన రూ.25 వేలు అభ్యర్థి చెల్లించాలని తెలియ చేశారు. ఇంకా మిగిలిన రూ.3 లక్షలను మూడు విడతలుగా అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్ దేశంలో ఉద్యోగావకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ఎర్ పర్యవేక్షిస్తుందన్నారు. ఉద్యోగం పొందిన అభ్యర్థికి జీతం నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు తెలియజేశారు.
ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ లింక్ https://shorturl.at/FB7ok నందు వివరాలని నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెప్టెంబరు 18వ తేదీలోగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 లోపు ఫోన్ నెంబరు 7386706272 కు ఫోన్ చేసి మరిన్ని వివరములు కొరకు సంప్రదించాలని ఆయన సూచించారు.