Breaking News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్‌

-సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు పక్షం రోజులపాటు “స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాలు
-యువతను భాగస్వామ్యంతో విజయవంతం చేద్దాం
-స్వచ్చత హి సేవా కార్యక్రమం మన కార్యాలయం నుంచే నిర్వహించుకుద్దాం
-వ్యర్థాల నుంచి వినూత్నమైన ఆవిష్కరణలు చేపట్టాలి.
-శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఒక సందేశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి
-ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యంతో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి
-కలెక్టరు పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
‘స్వచ్ఛత హి సేవా పక్షం రోజులు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1 వరకు ప్రజలు , ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి స్వచ్ఛత హి సేవా 2024 పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమం ప్రజల భాగస్వామ్యం – అవగాహన , సంపూర్ణ భాగస్వామ్యం , ఆరోగ్య పరీక్షలు – సామాజిక భద్రత కల్పించడం కోసం స్థానిక సంస్థలు, సమన్వయ శాఖలతో మూడు అంశాలతో కూడి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. పదిహేను రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చెయ్యాలన్నారు. ఏరోజు ఏ కార్యక్రమం చేపట్టాలో రోజూ వారీగా లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని, ఆమేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ ఉపయోగం లోనికి తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. స్వచ్చత కార్యక్రమం లో మన ఆఫీసు నుంచే పరిశుభ్రత డ్రైవ్ ప్రారంభిద్దాం.. ఆదర్శంగా ఉందామని కలెక్టర్ పిలుపు ఇచ్చారు. శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఒక సందేశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలని కలెక్టరు ప్రశాంతి స్పష్టం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షేడ్స్ పునర్ వ్యవస్థీకరణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని ఆహాల్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో శాఖలు వారీగా ప్రణాళికల పై అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు.

రోజువారీ చేపట్టవలసిన కార్యక్రమాలు :
17.09.2024 మానవ హారం, శుభ్రత పై మెగా డ్రైవ్ ప్రజా ప్రతినిధులు – ప్రముఖులు – ప్రజలతో సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణ, సేవలు

18.09.2024 స్వచ్ఛత పరుగులు – సైక్లాథాన్‌లు – మారథాన్‌లు , బ్లీచింగ్, దోమల నివారణ మందుల ఫిచికారీ నీరు నిలిచిపోయే ప్రదేశాలను శుభ్రపరచడం – పారిశుద్ధ్య కార్మికులకు ప్రథమ చికిత్స శిక్షణ

19.09.2024 – కార్యాలయాలు, విద్యా సంస్థలు & బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా ప్రతిజ్ఞ , డంప్‌ల గుర్తింపు మరియు డంప్‌ల తొలగింపు, పారిశుధ్య కార్మికుల గుర్తింపు & మంజూరు పథకాలతో అనుసంధానం

20.09.2024 – ప్లాంటేషన్ డ్రైవ్ ‘ఏక్ పెడ్ మా కే నామ్ , డంప్‌ల గుర్తింపు మరియు  డంప్‌ల తొలగింపు, పారిశుధ్య కార్మికుల గుర్తింపు & మంజూరు పథకాలతో అనుసంధానం

21.09.2024… స్వయం సహాయక సంఘాల, మెప్మా, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో అవగాహన ప్రచారాలు, ర్యాలీలు & పరిశుభ్రత డ్రైవ్ , పార్కుల శుభ్రపరచడం – నిర్వహణ & అభివృద్ధి , PPE కిట్‌లు & సేఫ్టీ గేర్‌ల పంపిణీ

 

22.09.2024 – మిషన్ లైఫ్ ప్రచారాలు (సేవ్ ఎనర్జీ & వాటర్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, స్థిరమైన ఆహారం) , కాలువలను శుభ్రపరచడం – డీసిల్టింగ్ చేయడం & డ్రెయిన్ నెట్‌వర్క్‌ను డి-క్లాగింగ్ చేయడం , పారిశుధ్య కార్మికులు & వారి కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం.

23.09.2024 – వర్షపు నీటి నిల్వ నిర్మాణాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు ,
రహదారుల, ఫుట్‌పాత్‌ల శుభ్రత & నిర్వహణ , పారిశుధ్య కార్మికులు & వారి కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం.

24.09.2024 – తాగునీటి నిర్మాణాల శుభ్రత & నిర్వహణపై అవగాహన ప్రచారాలు , డ్రింకింగ్ వాటర్ స్ట్రక్చర్ యొక్క క్లీనింగ్ & సూపర్ క్లోరినేషన్ & అన్ని నీటి నమూనాలను పరీక్షించడం , భద్రత & వ్యక్తిగత రక్షణపై సఫాయిమిత్రలు & వారి కుటుంబాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం.

25.09.2024 – వీధి నాటకాలు & నాటకాలు , వాణిజ్య & మార్కెట్ ప్రాంతాలను శుభ్రపరచడం , భద్రత & వ్యక్తిగత రక్షణపై సఫాయిమిత్రలు & వారి కుటుంబాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం.

26.09.2024 – అవాంఛిత యాప్‌లను క్లియర్ చేయడం & గాడ్జెట్‌ల నిర్వహణ కోసం సైబర్ స్వచ్ఛత & డిజిటల్ స్వచ్ఛత , కార్యాలయం & సంస్థాగత భవనాలను శుభ్రపరచడం , పిల్లల సంరక్షణ సహాయ కార్యక్రమాలు & విద్యా స్కాలర్‌షిప్‌ల అభివృద్ధి.

27.09.2024 – వార్డు/గ్రామ సభల నిర్వహణ , పబ్లిక్ స్పేస్‌ల సుందరీకరణ పార్కులు – టూరిస్ట్ పాయింట్లు మరియు  ఫ్లై ఓవర్లు & సెల్ఫీ పాయింట్ల ఇన్‌స్టాలేషన్ హై-లో స్ట్రీట్ క్లీనింగ్ డ్రైవ్‌లు ,  భద్రత & వ్యక్తిగత రక్షణపై సఫాయిమిత్రలు & వారి కుటుంబాలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం

28.09.2024 – సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆస్తులను వాల్ పెయింటింగ్స్‌తో సుందరీకరించడంపై అవగాహన కల్పించాలి ,  ఫుట్‌ఫాల్ ప్రాంతం & ప్లాస్టిక్, బ్యాటరీ & ఇ-వ్యర్థాల వంటి పునర్వినియోగపరచదగిన పదార్థాల సేకరణ & పారవేయడం,  ప్రివెంటివ్ టీకా డ్రైవ్‌లు.

29.09.2024 – పట్టణ , గ్రామాలలో చెత్తను సృష్టించే ఆర్ట్ శానిటేషన్ పార్కులపై అవగాహన , అభయారణ్యాలు – జూ ప్రాంతాలు – బీచ్‌లు & ప్రచార ప్రాంతాలను శుభ్రపరచడం ,  ఆరోగ్య బీమా నమోదు లో సహాకారం.

30.09.2024 – మూలాల విభజన, రీసైక్లింగ్ పద్ధతులు మరియు కంపోస్టింగ్‌పై విద్యా పబ్లిక్ ప్రదర్శనలు ,  కమ్యూనిటీ బేస్డ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అవగాహన డ్రైవ్‌లు – ఆరోగ్య బీమా నమోదు లో సహాకారం.

01.10.2024 – విద్యా సంస్థలలో  స్వచ్ఛ హ్యాకథాన్‌ల నిర్వహణ , కమ్యూనిటి, పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరచడం ,  చక్కటి భాగస్వామ్యం అయిన శానిటేషన్ కార్మికులు, ఇతరుల గుర్తింపు మరియు సన్మాన కార్యక్రమం

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *