Breaking News

మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసిన ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ని సెక్రటేరియట్ లో ఆయన ఛాంబర్ లో ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ఫౌండర్ చైర్మన్ డా. వేముల భాను ప్రకాష్, సభ్యులతో శుక్రవారం కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్ చికిత్సలు చేర్పించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రపోజల్స్ కేంద్రప్రభుత్వం కి పంపించేటట్లు సహకరించాలని కోరారు. ఈ విషయం పై మంత్రి స్పందిస్తూ కేంద్రప్రభుత్వం ఆయుష్ అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ దృష్టికి ఈ విషయం తీసుకొని వెళ్తామన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ ఏర్పాటు, ఆయుష్ వైద్యులకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లులు రాబోవు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేటట్లు చూడాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయుర్వేద వైద్యులు ఎమర్జెన్సీ కండిషన్స్ లో అల్లోపతి మెడిసిన్ ఉపయోగించుకొనే అవకాశం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ చట్టం 2020 మరియు డ్రగ్ అండ్ కాస్మెటిక్ చట్టం 1940 ప్రకారం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరగా, మంత్రి ఈ విషయం పై పూర్తి సమాచారం ఇవ్వమని కోరారన్నారు. ఆయుష్ వైద్యుల సమస్యలని ఎంతో ఓపికగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి (2024-25) రాష్ట్రంలో ఆయుష్ సేవ‌ల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం మున్నెన్న‌డూ లేనివిధంగా రూ.90 కోట్ల 84 ల‌క్ష‌లు నిధులు అందించ‌డానికి స‌మ్మ‌తి తెలిపినందుకు కేంద్రానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *