విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాస్ట్రేతరులు కూడా ముందుకొచ్చి విరాళాల అందించడం మంచి పరిణామమని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో తెలిపారు. వరద బాధితులకు పెద్ద ఎత్తున సోదర భావంతో విరాళాలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇలాంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు. We the People India, NGO మరియు YESWECAN సభ్యులు, Kings college London అలుమ్ని సభ్యులు కలసి 65 వేలు చెక్ ను అందించడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ (NISG) సభ్యులు,వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మంత్రి గారిని కలిసి విరాళం అందించడం జరిగింది. మంత్రిని కలిసిన వారిలో తమిళనాడు కేడర్ ఐఏఎస్ సాహే మీనా, స్టీఫెన్ అనురాగ్ ప్రత్తిపాటి, డాక్టర్ ఎన్జీ నిహాల్, డాక్టర్ మనోజ్ , సాహిల్ , డేవిడ్ దినకరన్ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీం జీవోను అమలు చేయాలి
-APUWJ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల హౌసింగ్ స్కీం విషయంలో గతంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ …