Breaking News

ఆప్షన్-3 ఇళ్ళ నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి

-అక్టోబర్ నేలాఖరకు 50 వేల ఇళ్ళు నిర్మించాలి
-సమస్యలకు వెంటనే పరిష్కారం
-సమీక్షా సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధ సారధి ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆప్షన్-3 ఇళ్ళ నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్రగృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి ఆప్షన్-3 కాంట్రాక్టర్లను ఆదేశించారు.నాణ్యత పై సమగ్రమైన విచారణ జరిపిస్తున్నామని, లోపాలు ఉంటె సంభందిత కాంట్రాక్టర్లుసరిదిద్దుకోవాలని, లోపాలు సరిదిద్దేవరకు నిర్మాణాలకు సంభదించిన చెల్లింపులు జరగవని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ లోని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఆప్షన్-3 కాంట్రాక్టర్లు,గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఆప్షన్-3 కింద నిర్మాణం జరుగుతున్న కాలనీలలో కాంట్రాక్టర్లకు ఎదురవుతున్న సమస్యల ఫై కూడా మంత్రి సమీక్ష చేసి వెంటనే పరిష్కార మార్గాలను కూడా సూచించారు.ఆప్షన్-3 కింద నిర్మాణాలు జరుగుతున్న జిల్లాలలో సకాలంలో ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసే భాద్యతను జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు తీసుకోవాలని,విధుల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహించవద్దుని మంత్రి పార్ధ సారధి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఇళ్ళ నిర్మాణాలలో పురోగతి చూపించాలని,కాంట్రాక్టు పొంది రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా పురోగతి లేని కాంట్రాక్టర్లు తక్షణమే పనులు మొదలు పెట్టి లక్ష్యాలను పూర్తి చేయాలని లేని పక్షంలో అవసరమైన చర్యలను తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.ఆప్షన్-3 కింద నిర్మాణంలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న 50 వేల ఇళ్ళను అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు.రూఫ్ లెవెల్, రూఫ్ కాస్ట్ లెవెల్లో ఉన్న నిర్మాణాలను త్వరగా పూర్తీ చేయాలని,జియో టాగింగ్ ఇతర పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని,జిల్లా అధికారులు కాంట్రాక్టర్లు సమన్వయం చేసుకొని నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

10 వేల శ్లాబులు
ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తీ అవుతున్న నేపధ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతుందని, దీనిలో భాగంగా వివిధ దశలలో నిర్మాణం లో ఉన్న ఇళ్ళకు 10 వేల శ్లాబులు పూర్తి అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ఫై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని,నిర్మాణంలో ఉన్న ఇళ్ళను సకాలంలో పూర్తి చేయాలని, ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తీ అవుతున్న సందర్భంగా గృహనిర్మాణ శాఖ తరపున 10 వేల ఇళ్ళ స్లాబులను పూర్తి చేసి ముఖ్యమంత్రి కి చూపించాలని,ఈ లక్ష్యాన్ని పూర్తీ చేయడానికి అధికారులు,కాంట్రాక్టర్లు నిరంతరం కృషి చేయాలని మంత్రి పార్ధ సారధి సూచించారు.రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ అక్టోబర్ నెలాఖరుకు 50 వేల ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, కాలనీలలో నీటి సమస్యను పరిష్కరించాలని, కాలనీలకు సమీపంలో బోర్లు వేయించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మైడెన్ దివాన్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీ.రాజబాబు, చీఫ్ఇంజినీర్ జీ.వీ.ప్రసాద్, సుపరెండేంట్ ఇంజినీర్లు సీ.జయరామా చారీ, ఎన్.నాగభూషణం,కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

సమస్యలకు వెంటనే పరిష్కారం
ఆప్షన్-3 కాంట్రాక్టర్లు అధికారులతో సమావేశమైన మంత్రి కాంట్రాక్టర్లు లేవనెత్తిన సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలను చూపించారు. విశాఖ జిల్లాలో కొన్ని కాలనీలలో నీటి సమస్య గురించి కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకొనిరాగా విశాఖ మెట్రో పాలిటిన్ రీజనల్ అభివృద్ధి సంస్థ అధికారులతో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జియో టేజింగ్ వంటి పనులు చేయడంలో గ్రామ సచివాలయాల అధికారులు సక్రమంగా సహకరించటం లేదని,దీనితో ఇళ్ళ నిర్మాణాలకు ఆటంకం కలుగుతోందని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకోని రాగా, ఈ సమస్యను జిల్లా కలక్టర్ ద్రుష్టికి తెసుకోనివెల్లి పరిష్కరించాలని, 15 రోజులలోగా ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లాల గృహనిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించారు. కాలనీలలో దొంగతనాలు జరగకుండా పొలిసు అధికారులతో మాట్లాడి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Check Also

సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంచార జాతుల సంక్షేమానికి సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *