Breaking News

చారిత్రాత్మక నేపథ్యం కలిగి నగరం రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చారిత్రాత్మక నేపథ్యం కలిగి రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి, వైద్య కళాశాల సందర్శన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రోకులకు సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా కుమారి 350 మంది వైద్యులు ఉంటే, 750 కి పై గా బెడ్స్ ఉన్నాయన్నారు.రోజుకు వెయ్యికి పైగా ఓపీలు ఉంటాయన్నారు.ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి జీతభత్యాలు ఇచ్చే విధాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు అన్నారు. రాజమండ్రి జి జి హెచ్ లో 304 మంది వైద్యులు వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా 180 మంచి మాత్రమే ఉన్నారన్నారు. ఆసుపత్రిలో 98 మంది సూపర్ స్పెషాలిటీ ఉంటే 28 ఖాళీలు ఉన్నాయన్నారు. నూతన వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీ లేకుండా వైద్య విద్యను విద్యార్థులకు ఎలా అందిస్తారని గత ప్రభుత్వానికి తెలియాలని మంత్రిగా చేస్తున్నారు. ఒక ప్రభుత్వం వైద్య రంగంలో 2500 కోట్ల రూపాయలు బకాయి ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే 652 కోట్లు వైద్య ఆరోగ్య రంగానికి చెల్లించడం జరిగిందన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *