-14 మంది చిన్నారులకు “మిషన్ వాత్సల్య” ఆర్ధిక చేయూత
-కలెక్టరు ప్రశాంతి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అజెండా అభివృద్ది అని, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అనపర్తి నియోజకవర్గం పరిధిలోని రామవరం – రాయవరం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన అజెండాగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన క్షణం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పనిచేయడం ఆయన నిబద్ధతకు ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన పనులను, అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్వులను అనుసరించిన గత మూడు నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. పెండింగ్ పనులు, అందుబాటులో ఉన్న నిధులను అనుసంధానం చేయడం ద్వారా అభివృద్ధి పథంలో ముందడుగులో నియోజకవర్గాన్ని నిలపడం జరిగిందన్నారు. గతంలో ఏదైనా అవకతవకలు అక్రమాలు జరిగిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా శాసనసభ్యులు అభివృద్ధినియ్యమన్నారు. నియోజవర్గ అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఆకాంక్ష ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారు 14 కోట్ల నిధులతో సిమెంట్ రోడ్లు రైలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు చేపట్టనున్నట్లు తెలిపారు. మిషన్ వాత్సల్య కింద 14 మందికి ఆర్థిక భరోసాను ఇవ్వడం జరిగింది అన్నారు. కెనాల్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కూ టమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ నియోజక వర్గంలో రానున్న రోజుల్లో అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపట్టానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
“మిషన్ వాత్సల్య” చిన్నారులకు ఆర్ధిక చేయూత
అనపర్తి మండలం రామవరం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల సంరక్షణలో పెరుగుతున్న చిన్నారులకు చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం “మిషన్ వాత్సల్య” పేరుతో అనపర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది విద్యార్థులకు నెలకు రూ.4,000/- చొప్పున ఆరు నెలలకు రూ.24,000/- అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, రామవరం సర్పంచ్ గిరడా గంగ భవాని, కుతుకులూరు సర్పంచ్ గొల్లి హేమ తులసి, కర్రి శేషారత్నం, కర్రీ వెంకట రామారెడ్డి ఆళ్ల గోవిందు, సత్తి దేవదాన రెడ్డి, నల్లమిల్లి గోపాలకృష్ణారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, తేనెల శ్రీనివాస్, అనపర్తి నియోజకవర్గం, రామవరం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.