గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం డివిజన్,గోకవరం మండలం, గోకవరం గ్రామములో పెట్రోల్ బంక్ ను తనిఖీ చేయు నిమిత్తం రావడం జరిగిందని జిల్లా జాయింటు కలెక్టర్ ఎస్ చిన్న రాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు కొత్తగా ప్రతిపాదించిన పెట్రోల్ బంక్ ఇన్స్ఫెక్షన్ నేపధ్యంలో చేపట్టవలసిన భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమా నిబంధనలు ఖచ్చితంగా పాటించడం పై ప్రోటోకాల్ ను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం తహశీల్దార్ వారి కార్యాలయమునకు వచ్చి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఈ-పంట నమోదు, ప్యాడి ప్రొక్యూర్ మెంట్ కేంద్రము తదితర అంశాలపై, రెవెన్యూ అంశములపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమములో కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ , పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …