-ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన అధికారులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జీవో నెంబర్ 84, 85 మేరకు సెప్టెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను రద్దుచేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసిందనీ అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్ర పటాలకు స్థానిక కలెక్టరేట్ నందు వారి కార్యాలయంలో క్షీరాభిషేకం చేయడం ద్వారా, నేటి శనివారం తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరిండెంట్లు, కే.జానకిరామ్, ఎస్ శ్రీనివాస్ లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సుబ్బారెడ్డి, శ్రీహరి, భీమలింగ, సబ్ ఇన్స్పెక్టర్లు భాగ్యలక్ష్మి , అఖిల మహేంద్ర, సతీష్, నవీన్ బాబు, రామకృష్ణ శాస్త్రి, అశోక్, జయశంకర్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మినిస్ట్రియల్ స్టాఫ్ పాల్గొన్నారు.