-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల్లో శరవేగంగా పారిశుధ్య నిర్వహణ జరుగుతుందని ఇప్పటివరకు 16,000 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్ధాలు తీశారని , వరద ప్రభావిత ప్రాంతాల్లో 149 సచివాలయంలో, అని సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ శరవేగంగా జరుగుతుందని, అధికారులు, పారిశుధ్య కార్మికులు యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లు పరిశుభ్రపరచడం, సైడ్ కాలువల్లో పూడికలు తీయటం, వరదల వల్ల పేరుకుపోయిన వ్యర్ధాలను జెసిబి లతో తీయటం, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు తరచుగా పారిశుద్ధ్య కార్మికుల ద్వారా డ్రోన్ల ద్వారా ఎంఎల్ఏ ఆయిల్స్ ప్లే చేయటం, బయో ఎంజైమ్ స్ప్రే చేయడం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో త్రాగుటకు నీరును సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజలు ఆరోగ్య దృష్ట్యా కాచిన నీరుని తాగాలని, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.