-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో 42వ డివిజన్ పరిధిలో శుక్రవారం అనారోగ్యంతో మరణించిన యలకల శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి యలకుల శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని మాజీ కార్పొరేటర్ యేదు పాటి రామయ్య సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.