Breaking News

సమాజంలో వైద్యుల పాత్ర కీలకం

-వైద్య విద్యార్థులు వైద్య విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-మంచి వైద్యులై పేదలకు మెరుగైన వైద్యం అందించండి
-జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్
-ఘనంగా ఎస్వి వైద్య కళాశాల కాలేజ్ డే

తిరుపతి హెల్త్, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని,అటువంటి వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత విద్యను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో కాలేజ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వి వైద్య కళాశాల విచ్చేసిన సందర్భంగా నాకు నా ఎంబిబిఎస్ చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. వైద్య విద్య అన్నది ఎంతో విలువైనది, ప్రతి ఒక్క విద్యార్థి చిత్తశుద్ధితో విద్యను అభ్యసించి మంచి వైద్యులుగా బయటికి వెళ్లాలని కోరుకుంటున్నానన్నారు.ప్రతి ఒక్క వైద్యుడు పేద రోగులకు వైద్యం అందించాలని,గ్రామీణ ప్రాంతంలో కొంతకాలం పనిచేసే అనుభవం తెచ్చుకొని పీజీ వైద్య విద్య చేరినట్లయితే ఇంకా మంచి వైద్యం అందించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి వైద్య విద్య అనంతరం పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే ఎస్వీ వైద్య కళాశాల పరిశోధనలో ముందడుగు వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.వైద్య పరిశోధనల్లో ఇతర రాష్ట్రాలతో,ఇతర దేశాలలో పోటీపడి పరిశోధనలలో చొచ్చుకపోవడం తిరుపతి ఎస్వి వైద్య కళాశాలకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని, వైద్య విద్యార్థులకు,రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఇటువంటి పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోటీపడి వైద్యంలో
మనం మెరుగైన వైద్యం అందించబోతున్నామని,
ఈ సందర్భంగా తెలపడానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.భారత ప్రధాని చెప్పినట్లు వైద్యరంగంలో మార్పులు రాబోతున్నాయని, ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.వైద్యం ఒకటే కాకుండా చదువుకున్న రోజుల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఒత్తిడికి గురికాకుండా చదువుకోవాలని వైద్య విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు,ప్రసూతి ఆసుపత్రి డాక్టర్ పార్థసారధిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సునీత, డాక్టర్ వెంకటేశ్వర్లు,డాక్టర్ మాధవి లత, అన్ని విభాగాధిపతులు, యుజి వైద్య విద్యార్థులు, వైద్య కళాశాల సిబ్బంది, పి.ఆర్ఓ. వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *