Breaking News

గ్రామీణ ప్ర‌జ‌ల‌ ఆరోగ్య సేవ‌ల‌కు విఘాతం క‌లిగించొద్దు

-విధుల‌కు హాజ‌రై ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలి
-పిహెచ్ సీ డాక్ల‌ర్ల స‌మ‌స్య‌ల్ని ప్రభుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది
-పీహెచ్‌సి డాక్ట‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల్ని మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తాం
-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల అసోసియేషన్ ప్ర‌తినిధులు వివరించిన సమస్యల్ని
ప్రభత్వం పరిగణనలోకి తీసుకుని త‌ప్ప‌కుండా పరిశీలిస్తుంద‌నీ, త్వ‌ర‌లో మరోసారి వారిని చర్చలకు పిలుస్తామ‌నీ, ఇటువంటి పరిస్తితులలో, వైద్యులు ధర్నాలు వంటి కార్యక్రమాలు తలపెట్టకుండా విధులకు హాజరై గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సేవలకు విఘాతంకలగకుండా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ కోరారు. ఈనెల 13 న ఆంధ్రప్రదేశ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల అసోసియేషన్ ప్ర‌తినిధుల్ని సమావేశానికి పిలిపించి వారి సమ్యల పై చర్చించామ‌ని ఆయ‌న నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ‌బాబు అధ్యక్షతన, ఇత‌ర‌ర విభాగాధిపతుల సమక్షంలో ఈ సమావేశం జరిగింద‌ని ఆయ‌న తెలిపారు.

పి.జి సీట్ల భ‌ర్తీలో ఇన్సర్వీస్ కోటాను కుదిస్తూ ఇచ్చిన జి.ఓ.85 పై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చర్చించారు. 2020 బ్యాచ్ డాక్టర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, పిహెచ్‌సీల్లో పని చేస్తున్న డాక్టర్లకు ప‌దోన్న‌తులు, గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న డాక్టర్లకు అలవెన్సులు మంజూరు వంటి సమ‌స్య‌ల్ని ప్రభుత్వం దుష్టికి తేవటం జరిగింది. జి.ఓ.85 పై జరిగిన చర్చలకు సంబంధించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల‌కు గ‌ల కారణాల్ని క్షుణ్నంగా వివరించడం జరిగింది. పీజీ సీట్లలో ఇన్సర్వీస్ కోటాను ప్రవేశ పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ రంగంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధికమించటానికి అని తెలియజేసారు, భవిషత్తులో అవసరమయ్యే స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పి.జి. కోర్సులలో ఇన్సర్వీస్ కోటాను క్లినికల్ విభాగంలో 30% నుండి 15% కు మరియు నాన్ క్లినికల్ విభాగంలో 50% నుండి 30% కు తగ్గించినట్లుగా అసోసియేషన్ వారికి వివరించారు. దీనికి అసోసియేషన్ వారు స్పందిస్తూ, ఈ నిర్ణయాన్ని మరల లోతుగా పరిశీలించి వారికి న్యాయం చేయవల్సిందిగా కోరారు.

ఈ స‌మావేశంలో చర్చించిన విషయాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల అసోసియేషన్ ప్ర‌తినిధుల‌కు వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు తెలియ‌జేశారు. చర్చల సారాంశాన్ని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు శనివారం సాయంత్రం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నివేదించారు. పిహెచ్‌సి డాక్టర్ల నిర్దిష్టమైన సూచనలు, ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల లభ్యతపై వీరివురూ చర్చించారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *