గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వర్షం నీరు డ్రైన్లలోకి మాత్రమే వెళ్ళాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్, రైలు పేట, పొత్తూరి వారి తోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలు గమనించి, తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణల వలన ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో ఓల్డ్ క్లబ్ రోడ్ లో డ్రైన్ పై పూర్తిగా ఆక్రమణలు జరిగి, మురుగుపారుదలకు వీలు లేకుండా ఉందన్నారు. పూడిక తీయడానికి కూడా ర్యాంప్ లు, ఆక్రమణలు ఉన్నాయని, తక్షణం వాటిని జెసిబిలతో తొలగించడం జరుగుతుందన్నారు. శనివారం సాయంత్రానికి ఓల్డ్ క్లబ్ రోడ్ రెండువైపులా డ్రైన్ పై ర్యాంప్ లు, ఆక్రమణలు తొలగించాలని ప్రజారోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించామన్నారు. వర్షాలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి డ్రైన్లపై ఆక్రమణల తొలగింపుకు సహకరించాలన్నారు. నగరంలో ప్రాంతాల వారీగా మేజర్ డ్రైన్ల పై ఆక్రమణల తొలగింపుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. పర్యటనలో తూర్పు ఎంహెచ్ఓ (ఇంచార్జి) రామారావు, డిఈఈ రాము, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …