Breaking News

వైద్య సేవలు గ్రామాలకు చేరాలి… : వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

చిలకలూరిపేట, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య సేవలు పట్టణాలకు పరిమితం కాకుండా గ్రామాలకు చేరాలంటే విస్తృతంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కోరారు. ఈనెల 15వ తేదీన చిలకలూరిపేట సమీపంలో గల నాగభైరవవారి పాలెంలో కీర్తిశేషులు వడ్లమూడి హరిబాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు శివయ్య సౌజన్యంతో మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 500 మంది రోగులకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండగా, గ్రామీణ ప్రాంతంలో ప్రతి 2000 మందికి కేవలం ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారని, ఇలాంటి పరిస్థితులలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, ఉచితంగా వైద్య పరీక్షల నిర్వహించి, వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం శుభ పరిణామం అన్నారు.
సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ ప్రసంగిస్తూ మానవత ద్వారా భవిష్యత్తులో నిష్ణాతులైన వైద్యుల బృందంతో వెనుకబడిన గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
మానవత అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ నాగభైరవవారి పాలెం మరియు పరిసర గ్రామాల నుండి దాదాపు 300 మంది ప్రజలు ఈ వైద్య శిబిరానికి హాజరై, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు పొందడం ఆనందాన్ని కలిగించిందన్నారు.
మానవత కార్యదర్శి కె. సతీష్ ప్రసంగిస్తూ వడ్లమూడి శివయ్య దాతృత్వంతో దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి వైద్య శిబిరాన్ని తన స్వగ్రామంలో నిర్వహించడం ఆనందదాయకం అన్నారు.
మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి. ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక అభివృద్ధితో పాటు శారీరక మానసిక ఆరోగ్య ప్రమాణాలు కూడా మెరుగవడానికి ఇలాంటి వైద్య శిబిరాలు తోడ్పడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు, నరసరావుపేటకు చెందిన 9 మంది పలు విభాగాల నిష్ణాతులు పాల్గొని వైద్య సేవలు అందించారు.
డాక్టర్ జి. నాగార్జున, డాక్టర్ నటరాజ్ పి, డాక్టర్ డి. అమర్, డాక్టర్ డి. పద్మజ, డాక్టర్ డి. రాకేష్ బాబు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ వంశీ లు వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో మానవత డైరెక్టర్స్ ఉప్పల సాంబశివరావు, ఎన్. సాంబశివరావు, వర్రె సుబ్రహ్మణ్యం, గురువారెడ్డి, సిహెచ్. శివాజీ, మేకల రామారావు, ఆనందరావు, సాయి కిరణ్, లక్ష్మీనారాయణ, మందలపు సాంబశివరావు, ఎం. వెంకట్రావు లతో పాటు ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *