Breaking News

డాక్టర్.కాకాని తరుణ్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో 125 మంది ప్రాథమిక సభ్యత్వాలు 


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఈస్ట్ బెంజ్ సర్కిల్ లో ఆదివారం స్వాతంత్ర్య సమరయోధులు కాకాని వెంకటరత్నం విగ్రహ కూడలి లో విగ్రహ కమిటీ చైర్మన్ డాక్టర్. కాకాని తరుణ్ బిజెపి సభ్యత్వ నమోదు శిబిరం ఏర్పాటు చెయ్యటం జరిగింది . ఈ శిబిరానికి ముఖ్య అతిధి గా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాం విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ కన్వీనర్  పోతంశెట్టి నాగేశ్వర రావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల రమేష్, కొలపల్లి గణేష్, జాస్తి సతీష్, దాసరి రవి కుమార్, రమాదేవి, శాఖమూరి రాజేంద్ర ప్రసాద్, పీవీవీ రాజు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి క్రియాశీల సభ్యులు గా కాకాని తరుణ్ 125 మందిని ప్రాథమిక సభ్యులుగా ఒక్క రోజు లోనే సభ్యత్వాలు నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు. ఘనం గా సభ్యత్వ నమోదు చేసి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర అద్యక్షుల వారికి వివరాలు అందచేస్తామని కాకాని తరుణ్ తెలియచేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *