గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చత హి సేవాలో భాగంగా మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జిఎంసి ప్రధాన కార్యాలయం, విజ్ఞాన మందిరం, ఎన్టీఆర్ స్టేడియాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్ధులతో స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో స్వచ్చ గుంటూరు లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్వచ్చత హి సేవా కార్యక్రమం తొలి రోజు అయిన మంగళవారం నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు, వార్డ్ సచివాలయాల్లో స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 5:30 గంటలకు ప్రజారోగ్య కార్మికులు, అధికారులు, సిబ్బందితో మస్టర్ కార్యాలయంలో, 10 గంటలకు జిఎంసి ప్రధాన కార్యాలయం, 10:30 గంటలకు వార్డ్ సచివాలయాల్లో, నియోజకవర్గాల స్థాయిలో సాయంత్రం 4 గంటలకు తూర్పు నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, 5 గంటలకు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిజ్ఞ జరుగుతుంది. నగరంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థలు ప్రతిజ్ఞలో పాల్గొని స్వచ్చ గుంటూరులో భాగస్వాములు కావాలని కోరారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …